వంచన చిత్రం నవంబర్ 8న విడుదల
1 month ago | 5 Views
చండీ దుర్గా ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఉమా మహేష్ ప్రధాన పాత్రలో సూర్య, రాజేంద్ర మరియు ఆర్ కె నాయుడు, సోనీ రెడ్డి ముఖ్య తారాగణం తో ఉమా మహేష్ మార్పు దర్శకత్వం లో గౌరీ మార్పు నిర్మిస్తున్న చిత్రం "వంచన". అయితే ఈ రోజు ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్ ను సోషల్ మీడియా లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 8 న విడుదల.
ఈ సందర్భంగా దర్శకుడు ఉమా మహేష్ మార్పు మాట్లాడుతూ "వంచన ఒక కోర్టు రూమ్ ఎమోషనల్ డ్రామా చిత్రం. అరకు ఊరిలో ఒక క్రిస్టియన్ ఫాదర్ ని అతి కిరాతకంగా హత్య చేస్తారు. మంచి స్క్రీన్ ప్లే తో అద్భుతమైన ట్విస్టులతో హత్య ఎవరు మరియు ఎందుకు చేస్తారో తెలిపే కోర్టు రూమ్ డ్రామా కథే మా 'వంచన' సినిమా. మా చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సభ్యులు మా చిత్రాన్ని చూసి సున్నితమైన కథని చాలా గొప్పగా చిత్రీకరించారు అని అభినందించారు. ఇటీవలే మా చిత్ర టీజర్ ను విడుదల చేసాము. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ను నవంబర్ 2 న విడుదల చేస్తున్నాము. సినిమా చాలా కొత్తగా, మంచి థ్రిల్లింగ్ అంశాలతో ఉంటుంది. అరకు, ఢిల్లీ, మనాలి, హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, విజయనగరం, జైపూర్ లాంటి అందమైన లొకేషన్స్ లో మా చిత్రాన్ని రెడ్ డ్రాగన్ సినీ లైన్ కెమెరా తో చిత్రీకరించాం. మా సినిమా ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. నవంబర్ 8న విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నాము" అని తెలిపారు.
చిత్రం పేరు : వంచన
నటీనటులు : ఉమా మహేష్, సోనీ రెడ్డి, సూర్య, రాజేంద్ర, ఆర్ కె నాయుడు, దివాకర్, శ్రీనివాస్ మరియు తదితరులు.
బ్యానర్ : చండీ దుర్గా ఎంటర్టైన్మెంట్స్
కలరిస్ట్ : ఈబిన్ ఫిలిప్స్
సౌండ్ డిజైన్ : ప్రదీప్ గోపీనాథ్
బార్ సౌండ్ మిక్సింగ్ : రాహుల్ రాజన్
కాస్టింగ్ డైరెక్టర్ : మోడల్ శ్రీనివాస్
మేనేజర్ : ఏ బాలగంగాధర రావు
ఆర్ట్ డైరెక్టర్ : ఈశ్వర్ కురిటి
అసోసియేట్ డైరెక్టర్ అండ్ టీం : లక్ష్మి వెంకటేష్, ప్రసాద్, తనవరపు, వినోద్ రెడ్డి
లిరిక్ రైటర్ : వరదరాజ్ చిక్కబల్లపుర, అనిరుద్ శాండిల్య మారంరాజ్
పి ఆర్ ఓ : పాల్ పవన్
డిజిటల్ పి ఆర్ ఓ : విజయ్ నాగ్ యార్లగడ్డ
ఎడిటర్ : గురుమూర్తి హెగ్డే కాన్నిపల్, నవీన్ హెగ్డే
సినిమాటోగ్రఫీ : సతీష్, భాస్కర్
కో డైరెక్టర్ : నిరంజన్ డి ఎస్
సంగీతం : విజిత్ కృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విప్లవ్
ప్రొడ్యూసర్ : గౌరీ మార్పు
డైరెక్టర్ : ఉమా మహేష్ మార్పు
ఇంకా చదవండి: "క" సినిమాలో ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు, స్ట్రాంగ్ కంటెంట్, యూనిక్ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది - ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# వంచన # ఉమా మహేష్ # సోనీ రెడ్డి